దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.) జమ్మూకశ్మీర్‌లో 2021 నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చేనెల 24న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. దీంతోపాటు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా రాజీనామా కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకూ అదే రోజు ఎన్నిక నిర్వహిస్తామని వెల్లడించింది. పంజాబ్‌లో శాసనసభకు ఎన్నికైన కారణంగా అరోడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. జమూకశ్మీర్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నజీర్ అహ్మద్ లవే, గులామ్ నబీ ఆజాద్‌ల పదవీ కాలం 2021, ఫిబ్రవరి 15న పూర్తైంది. నాటి నుంచీ ఆ ప్రాంతానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లకు వచ్చేనెల 24న ఓటింగు పూర్తయ్యాక ఒక గంటలోనే ఫలితాలు ప్రకటిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ