రాజన్న సిరిసిల్ల జిల్లా డి పి ఆర్ ఓ పై వేటు.. సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు..
రాజన్న సిరిసిల్ల, 25 సెప్టెంబర్ (హి.స.) ఒక కార్టూన్ వైరల్ చేయడంలో కీలక పాత్ర వహించిన సిరిసిల్ల జిల్లా డీపీఆర్ శ్రీధర్ పై వేటు పడింది. సిరిసిల్ల జిల్లా అధికారుల గ్రూపులో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై వచ్చిన అభ్యంతకరమైన కార్టూన్
రాజన్న సిరిసిల్ల


రాజన్న సిరిసిల్ల, 25 సెప్టెంబర్ (హి.స.)

ఒక కార్టూన్ వైరల్ చేయడంలో కీలక పాత్ర వహించిన సిరిసిల్ల జిల్లా డీపీఆర్ శ్రీధర్ పై వేటు పడింది. సిరిసిల్ల జిల్లా అధికారుల గ్రూపులో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై వచ్చిన అభ్యంతకరమైన కార్టూన్ ను పోస్టు చేసినందుకు డీపీఆర్ శ్రీధర్ ను సస్పసెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మధ్య సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మొదలైన ప్రోటోకాల్ వివాదం కాస్త డిపీఆర్వో మెడకు చుట్టుకుంది. వారం రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ కు మధ్య భిన్నమైన కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో కలెక్టర్కు, విప్ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇందులో భాగంగా మీడియాలో ప్రభుత్వ విప్ను కించపరిచే విధంగా వచ్చిన కార్టూన్ ను జిల్లా అధికారుల అసోసియేషన్ గ్రూపులో డీపీఆర్వో పోస్ట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande