కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో స్మితా సబర్వాల్ కు హైకోర్టులో రిలీఫ్
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘ
స్మితా సబర్వాల్


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయాలంటూ స్మితా సభర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై వాదనలు విన్న ధర్మాసనం.. నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

స్మితా సభర్వాల్ గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande