స్వచ్ఛత హి సేవా' ప్రచారంలో భాగంగా స్వచ్ఛతా వాకథాన్
కార్యక్రమాన్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
స్వచ్ఛత హి సేవా' ప్రచారంలో భాగంగా స్వచ్ఛతా వాకథాన్


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

'

• “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ అనే శ్రమదాన కార్యక్రమం నిర్వహించబడింది.

‘స్వచ్ఛతా హి సేవా 2025’ ప్రచారంలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా సెప్టెంబర్ 25, 2025న వాకథాన్ మరియు ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ అనే శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనరల్ మేనేజర్ సికింద్రాబాద్‌లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేయించి వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రైల్వే బోర్డు అదనపు సభ్యులు (వర్క్స్) శ్రీ రాజేష్ అగర్వాల్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ సంతోష్ కుమార్ వర్మ, దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ శాఖలకు చెందిన ప్రధాన విభాగాధిపతులు, ఇతర సీనియర్ అధికారులు, క్రీడా సిబ్బంది, స్కౌట్స్ & గైడ్స్ మరియు రైల్వే పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చని వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రసంగిస్తూ, స్వచ్ఛత ప్రచారంలో భాగంగా జోన్ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో, ఆసుపత్రులు మరియు నివాస కాలనీలలో చేపడుతున్న వివిధ కార్యకలాపాలను ఆయన వివరించారు. జనరల్ మేనేజర్ స్వచ్ఛత పట్ల నిబద్ధత నిరంతర సాధనగా ఉండాలని నొక్కిచెప్పారు మరియు సిబ్బంది అందరూ తమ కుటుంబాలను మరియు సమాజాలను స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఏడాది పొడవునా పాల్గొనేలా ప్రోత్సహించారు.

రైల్వే బోర్డు అదనపు సభ్యులు (వర్క్స్) శ్రీ రాజేష్ అగర్వాల్ స్వచ్ఛత ప్రచారంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే బృందం జోన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన స్వచ్ఛత ప్రచారాన్ని ప్రశంసించారు. వ్యక్తిగత మరియు ప్రజా శ్రేయస్సు కోసం ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు పరిశుభ్రత కోసం అంకితం చేయాలని అధికారులు మరియు సిబ్బందిని ఆయన ప్రోత్సహించారు.

స్వచ్ఛతా హి సేవా 2025 ప్రచారం ఐదు కీలక అంశాలపై దృష్టి పెడుతుంది: i) పరిశుభ్రత లక్ష్య యూనిట్ల (సి. టి. యూలు) పరివర్తన-ఇందులో కష్టతరమైన మరియు నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలను శుభ్రపరచడం ii) పరిశుభ్రమైన ప్రజా స్థలాలు - స్టేషన్లలో మరియు అధిక జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలలో పరిశుభ్రతను పెంచడం iii) సఫాయి మిత్ర సురక్ష శిబిరాలు - ఆరోగ్య తనిఖీలు మరియు సంక్షేమ సహాయాన్ని అందించడం, iv) క్లీన్ గ్రీన్ ఉత్సవ్ - జీరో-వేస్ట్, పర్యావరణ

అనుకూల వేడుకలను ప్రోత్సహించడం మరియు v అనుసరణ పై విస్తృత అవగాహన ప్రచారం: గ్రామాలకు శుభ్రమైన నీటి సరఫరా, వ్యర్థాల నుండి కళాత్మక వస్తువులు, శుభ్రమైన వీధి ఆహారం, వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ (ఆర్.ఆర్.ఆర్) కేంద్రాలు మొదలైనవి.

దక్షిణ మధ్య రైల్వేలో దాదాపు 6,200 పరిశుభ్రత లక్ష్య యూనిట్లు(క్లీన్‌నెస్ టార్గెట్ యూనిట్లు) గుర్తించబడ్డాయి. వాటిలో 2150 కి పైగా ఇప్పటికే రూపాంతరం చెందాయి మరియు మిగిలిన ప్రదేశాలలో పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రచారానికి మద్దతుగా ఇప్పటివరకు 118 అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయి. సఫాయి మిత్ర సురక్ష చొరవ కింద, 64 ఆరోగ్య శిబిరాలు నిర్వహించబడ్డాయి మరియు 4,531 భద్రతా పి.పి.ఈ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) కిట్లు పంపిణీ చేయబడ్డాయి. ఇంకా, 4,300 మందికి పైగా వ్యక్తులు శ్రమదాన కార్యకలాపాలలో నిమగ్నమై, శుభ్రపరచడం మరియు పారిశుధ్యం కోసం తమ సమయాన్ని మరియు కృషిని అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande