హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదని అన్నారు. ఢిల్లీలో ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. పలు కీలక అంశాలపై ముచ్చటించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విషయం ఏఐసీసీ పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా చేస్తున్నామన్నారు. డీసీసీల అంశంపై సమావేశంపై ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో మీటింగ్ ఉంటుందని, ఈ సమావేశానికి ఏఐసీసీ కొత్తగా ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు హాజరవుతారని చెప్పారు. అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు