దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.)ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో ఎదురైన చేదు అనుభవాల (technical mishaps at the United Nations )పై ట్రంప్ (US President Donald Trump ) సీరియస్‌గా స్పందించారు. సీక్రెట్ సర్వీస్ దానిపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈవిషయాన్ని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘‘ఐరాస (United Nations)లో నిన్న నాకు అవమానం జరిగింది. ఒక్కసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా మూడు దురదృష్టకర ఘటనలు జరిగాయి. తొలుత పైకి వెళుతున్న ఎస్కలేటర్ ఆగిపోయింది. ఆ తర్వాత టెలిప్రాంప్టర్ పని చేయలేదు. అది దాదాపు 15 నిమిషాలు ఆగిపోయింది. కానీ, నా ప్రసంగానికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి’’ అని పేర్కొన్నారు. ఇక ఆడిటోరియంలోని సౌండ్ సిస్టమ్ ఘోరంగా ఉందని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడిన తర్వాత భార్య మెలానియా వైపు చూడగా.. ఆమె ఒక్క ముక్క కూడా వినిపించలేదని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు