అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.)అమరావతిలో విద్యుత్తు ప్రమాదాలకు తావులేకుండా అధునాతన భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఆర్డీయే భవనాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని చెప్పారు. రాయపూడిలో సీఆర్డీయే ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వివిధ చాంబర్లను అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబరు 2న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం జరుగుతుండటంతో ఆ సమయానికి విద్యుత్తు పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. సీఆర్డీయేతో విద్యుత్తు శాఖ సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ