ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూత.. కేటీఆర్, హరీశ్ రావు దిగ్భ్రాంతి
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ''వొడువని ముచ్చట'', ''నీళ్ల ముచ్చట'', ''సర్వాయి పాపన్న చరిత్ర'' వంటి పుస్తకా
రైటర్ వెంకట్ గౌడ్


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'వొడువని ముచ్చట', 'నీళ్ల ముచ్చట', 'సర్వాయి పాపన్న చరిత్ర' వంటి పుస్తకాలను రాశారు. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రముఖ రచయిత, తెలంగాణ మట్టిబిడ్డ కొంపెల్లి వెంకట్ గౌడ్ ఇక లేరన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. వారి హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని చెప్పారు.

రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ హఠాన్మరణం బాధాకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ మనో గతానికి 'వొడువని ముచ్చట'గా, ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచనలకు 'నీళ్ల ముచ్చట'గా పుస్తక రూపం ఇచ్చారని తెలిపారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షరబద్దం చేసి ప్రజలకు అందించారన్నారు. తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande