ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10 వేల సీట్ల పెంపు
దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.): దేశంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 10 వేల సీట్లు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల వైద్యవిద్య సామర్థ్యం పెరిగి ఎక్కువ మంది స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులోకి వస్తారని, అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఆ మ
Medical device suppliers


దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.): దేశంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 10 వేల సీట్లు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల వైద్యవిద్య సామర్థ్యం పెరిగి ఎక్కువ మంది స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులోకి వస్తారని, అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఆ మేరకు కొత్త విభాగాలు ప్రవేశపెట్టడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తదనుగుణమైన మౌలిక వసతుల కల్పనకు రూ.15,034 కోట్లు ఖర్చు చేయనుంది. దేశీయంగా నౌకా నిర్మాణంలో ఊపు తెచ్చేందుకు రూ.69,725 కోట్ల భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం క్యాబినెట్‌ సమావేశమైంది. రూ.94,916 కోట్ల విలువైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande