బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
తిరుమల, 25 సెప్టెంబర్ (హి.స.)ఆపదమొక్కుల వాడు, అనాథ రక్షకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సాలకట్ల బ్రహోత్సవాలు కొనసాగుతోన్న వేళ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరల
తిరుమల


తిరుమల, 25 సెప్టెంబర్ (హి.స.)ఆపదమొక్కుల వాడు, అనాథ రక్షకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామి వారి సాలకట్ల బ్రహోత్సవాలు కొనసాగుతోన్న వేళ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.

ఇక రూ.300 ప్రత్యేక దర్శనం (Special Darshan) కోసం టోకెన్ తీసుకున్న వారికి రెండు గంటలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అవుతోంది. ఇక గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 58,628 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 21,551 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.01 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande