దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారు. దీంతో అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 25 బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది.
పూర్త వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అనేక ప్రాంతాల్లో అక్రమ వలసదారుల కోసం తనీఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 25 బంగ్లాదేశ్ వాసులు అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. సౌత్ ఈస్ట్ జిల్లాఅదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ.. అరెస్టైన వారిలో 13 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారని.. వారు బంగ్లాదేశ్‌లో ఉన్న వ్యక్తులతో ఒక యాప్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ