వీఐపీ దర్శన సమయాల్లో మార్పు.. ఈవో కీలక నిర్ణయం
విజయవాడ,, 25 సెప్టెంబర్ (హి.స.) ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాదిపై వెలసిన కనక దుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేశారు ఆలయ అధికారులు. తాజాగా సామాన్య భక్తుల కోసం దుర్గగ
విజయవాడ


విజయవాడ,, 25 సెప్టెంబర్ (హి.స.) ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాదిపై వెలసిన కనక దుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేశారు ఆలయ అధికారులు. తాజాగా సామాన్య భక్తుల కోసం దుర్గగుడి ఈవో శీనా నాయక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీలతో సామాన్య భక్తులకు క్యూలైన్లలో ఇబ్బందుల దృష్ట్యా ప్రోటోకాల్ సమయాలను కుదించారు ఈవో. గతంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఐపీలకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వీఐపీ ప్రోటోకాల్ సమయాల్లో మార్పులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మూడు స్లాట్‌లలో గంట చొప్పున దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం 5 నుంచి 6 దాకా, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల దాకా గంట చొప్పున మూడు స్లాట్‌లలో వీఐపీలకు దర్శనం కల్పించాలని ఈవో శీనా నాయక్ నిర్ణయం తీసుకున్నారు

.

మరోవైపు దసర శరన్నవాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు దసరా ఉత్సవాలలో 4వ రోజు దుర్గమ్మ కాత్యాయిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. 11 గంటల వరకు 50000 వేల భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్లూ లైన్‌లో ఉన్న భక్తులకు వాటర్ బాట్టిల్స్, పాలు, మజ్జిగ పాకెట్స్‌లను ఆలయ అధికారులు పంపిణీ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande