దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.)భారత్ (India) ఆయుధ శక్తి మరో కీలక ముందడుగు వేసింది. తొలిసారి రైలు పైనుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని పరీక్షించింది. ఈవిషయాన్ని డీఆర్డీవో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అణుసామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ క్షిపణిని దీని(Agni-Prime Missile from a Rail based Mobile launcher system) పైనుంచి ప్రయోగించినట్లు రాజ్‌నాథ్ (Defence Minister Rajnath Singh) తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఆయన రక్షణ పరిశోధనాభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో) (DRDO) ను అభినందించారు. అతితక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంఛింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
‘‘ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ (Rail based Mobile launcher system) లాంఛర్ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం. రైల్ నెట్‌వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి.. తక్కువ రియాక్షన్ టైమ్‌లో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చు’’ అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు