కడప ఇంచార్జ్ మేయర్‌గా ముంతాజ్ బేగం.. మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ
కడప , 25 సెప్టెంబర్ (హి.స.)సివిల్‌ కాంట్రాక్టుల (Civil Contracts) వ్యవహారంలో కడప మేయర్ సురేశ్ బాబు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను మేయర్ పదవి నుంచి తప్పిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ (Sur
కడప ఇంచార్జ్ మేయర్‌గా ముంతాజ్ బేగం.. మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ


కడప , 25 సెప్టెంబర్ (హి.స.)సివిల్‌ కాంట్రాక్టుల (Civil Contracts) వ్యవహారంలో కడప మేయర్ సురేశ్ బాబు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను మేయర్ పదవి నుంచి తప్పిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ (Suresh Kumar) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తాజాగా కడప డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్ బేగం (Mumtaz Begum)కు ఇంచార్జ్ మేయర్‌గా బాధ్యతలు కట్టబెట్టారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి అధికారి ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా, సురేష్‌బాబు మేయర్‌గా ఉండి నిబంధనలకు విరుద్ధంగా ఆయన కుటుంబీకులు గత ఏడాది కాలంగా కడప నగరపాలక సంస్థలో సివిల్‌ కాంట్రాక్టులు పనులు చేపడుతున్నారని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (Madhavi Reddy) ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. అదే విషయంపై విజిలెన్స్‌ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసి కాంట్రాక్టులు చేసిన విషయం నిజమేనని తేల్చి ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో మార్చి 24న వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ శాఖ మేయర్‌ సురేష్‌ బాబుకు నోటీసులు జారీ చేసింది. అనంతరం మే నెలలో ఆయనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ, మున్సిపల్ శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సురేష్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం సురేష్‌బాబు ఈనెల సెప్టెంబర్‌ 17న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో తన వాదనలు వినిపించారు. కానీ, విజిలెన్స్‌ రిపోర్టులోని అంశాలు, కమిషనర్‌ వాంగ్మూలం ఆధారంగా పురపాలక శాఖ మరోసారి సురేష్‌బాబును పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande