తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
తిరుమల, 25 సెప్టెంబర్ (హి.స.)ఇటీవల భారత ఉపరాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) విజయం సాధించి.. బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh Tour) పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా మొదటిసారి ఏపీకి వచ్చిన ఆయన తిరుమల తిరు
vice-president-cp-radhakrishnan-in-tirumala-tirupati-478236


తిరుమల, 25 సెప్టెంబర్ (హి.స.)ఇటీవల భారత ఉపరాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) విజయం సాధించి.. బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh Tour) పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా మొదటిసారి ఏపీకి వచ్చిన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

అంతకు ముందు ఆయన తిరుమల ఆలయం వద్దకు చేరుకోగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu), టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం సౌకర్యం కల్పించారు. ఉపరాష్ట్రపతి.. రాధాకృష్ణన్.. ఈ రోజు ఉదయం కూడా తిరుమలలో పర్యటించారు. ఇందులో భాగంగా.. యాత్రికుల వసతి సముదాయం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో పాటు లడ్డూ నాణ్యత యంత్రాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం, టీటీడీ అధికారులతో కలిసి దాదాపు 50 నిమిషాల పాటు శ్రీవారి ఆలయంలోనే ఉపరాష్ట్రపతి గడిపారు.

యాత్రికుల వసతి సముదాయంఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రారంభించిన ఈ వెంకటాద్రి నిలయం.. యాత్రికులకు వసతి కల్పించనుంది. ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా రూ.102 కోట్లతో టీటీడీ ఈ నూతన ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. ఇందులో ఒకేసారి 4 వేల మందికి ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలూ వేడి నీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. అలాగే ఒకేసారి 1400 మంది భోజనానికి వీలుగా రెండు డైనింగ్ హాల్స్ ఉన్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande