దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పవిత్ర నవరాత్రి పండుగలో మహిళల ఆశీస్సులు తమకు గొప్ప బలం అని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరీమణులందరికీ ఈరోజు రూ.10 వేలు చేరుతాయని చెప్పారు. ఒకప్పుడు దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందేనని.. గతంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే.. చివరికి 15 పైసలు మాత్రమే చేరేదని ఆరోపించారు. మధ్యలో దోచుకునే వారు ఉండడంతో చాలా అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా అకౌంట్లలో రూ. 10 వేలు పడిపోతున్నాయని చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ