సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ డి.రాజా
చండీగఢ్‌- /హైదరాబాద్‌/దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా గురువారం తిరిగి ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో జరిగిన పార్టీ 25వ మహాసభలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ నెల 21న ప్రారంభమైన పార్టీ మహాసభలు గురువా
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ డి.రాజా


చండీగఢ్‌- /హైదరాబాద్‌/దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా గురువారం తిరిగి ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో జరిగిన పార్టీ 25వ మహాసభలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ నెల 21న ప్రారంభమైన పార్టీ మహాసభలు గురువారం ముగిశాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 11 మంది సభ్యులు కలిగిన జాతీయ కార్యదర్శి వర్గాన్ని, 31 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని పార్టీ ఎన్నుకుంది. పార్టీ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా, కేంద్ర కమిటీ ఛైర్మన్‌గా కె.నారాయణ ఎన్నికయ్యారు. తెలంగాణకు చెందిన ఎండీ యూసుఫ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.దుర్గాభవాని తదితరులు సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌లో సభ్యులుగా స్థానం పొందారు. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా రామ్‌ బహేతి ఎన్నికయ్యారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande