ఒంగోలు, 26 సెప్టెంబర్ (హి.స.)
: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు మూడు గ్యాంగులుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు. కళాశాల నాలుగో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రికెట్ బెట్టింగుల నేపథ్యంలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ