అమలాపురం, 26 సెప్టెంబర్ (హి.స.)
: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారితో పాటు ఆలయాన్ని భారీగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ.4,41,99,999 విలువైన కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ