ముంబై, 26 సెప్టెంబర్ (హి.స.)బంగారం కొనుగోలు చేసే వారికి నేడు తీపికబరు అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. కాగా, శుక్రవారం, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బులియన్ మార్కెట్లో శుక్రవారం(సెప్టెంబర్ 26) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1,14,430 గా ఉంది.(రూ.10 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం రూ.1,04,890 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం తులం రూ.85,820 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 25, 2025 గురువారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,14,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,04,900గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,04,890గా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,430ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,04,890 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి