దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.) హెచ్ఐవీ కి సంబంధించిన మెడిసిన్ భారత్ అత్యంత చౌకగా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఔషదం ధర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్లు, కానీ భారత దేశంలో దీన్ని చాలా తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్-AIDS) ఔషధం భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈ ఔషధం ధర అమెరికాలో దాదాపు ₹3.5 మిలియన్లు, కానీ భారతదేశంలో 3,300లకే అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. భారతీయ జనరిక్ ఔషద కంపెనీలు ఈ డ్రగ్ ను ఉత్పత్తి చేసేందుకు అన్ని రకాల లైసెన్స్ లు, టెక్నికల్ సపోర్ట్ ను పొందాయి. దీంతో పేద, మధ్య-ఆదాయ దేశాలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటుంది.
నివేదికల ప్రకారం.. లెనాకాపావిర్ అనే ఔషధం ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా వంటి దేశాలలో HIV సంక్రమణకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతోంది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్ మరియు ఇతర ప్రాంతాలలో HIV సంక్రమణకు చికిత్సగా సన్లెంకా బ్రాండ్ పేరుతో అమ్ముడవుతోంది. అద్భుత ఔషధంగా పిలువబడే భారతీయ కంపెనీలు హెటెరో ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ఇటీవల దాని జెనరిక్ వెర్షన్‌ను ఉత్పత్తి చేయడానికి ఆమోదం పొందాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ