అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్ఫా పీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ పీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం 27వ తేదీన ఉత్తర కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపటి నుంచి 29వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని హెచ్చరించారు.
ఈరోజు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికలు జారీ చేశాయి. తీరం వెంట గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప జనాలను బయటకు రావొద్దంటూ సూచించింది. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి