అవసరమైతే కలెక్టరేట్ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయాలి: హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.) భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. అవసరమైతే కలెక్టరేట్ హెల్ప్ లైన్ నెంబర్ 9063423979 కు ఫోన్ చేయాలని సూచించారు . ఈ మేరకు శుక్ర
హైదరాబాద్ కలెక్టర్


హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. అవసరమైతే కలెక్టరేట్ హెల్ప్ లైన్ నెంబర్ 9063423979 కు ఫోన్ చేయాలని సూచించారు . ఈ మేరకు శుక్రవారం ఆమె సికింద్రాబాద్ రసూల్ పురాలోని ప్యాట్నీ నాలాను సందర్శించిన అనంతరం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు, మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆయా ప్రాంతాలలో రెస్క్యూ టీమ్స్, రెవిన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షాలతో ఇండ్లలోకి నీళ్లు రావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే కలెక్టరేట్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయాలని, వెంటనే అధికారులు, సిబ్బంది అప్రమత్తమై సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande