ముంబయి: 26, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు మరో రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Opening Today). అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నడుమ మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 397 పాయింట్ల నష్టంతో 80,769 వద్ద ఉండగా.. నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 24,775 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.68గా ఉంది.
నిఫ్టీ సూచీలో ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. కాగా.. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. హెచ్-1బీ వీసా ఫీజు (H-1B Visa Fee)ను 1,00,000 డాలర్లకు పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఐటీరంగంపై ప్రభావం చూపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ