కర్నూలు, 26 సెప్టెంబర్ (హి.స.)రోజూ పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యం, చర్మానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. కొబ్బరి, దాని నీరు రెండూ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. పచ్చి కొబ్బరిని అనేక వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మానికి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ పచ్చి కొబ్బరి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
పచ్చి కొబ్బరి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే కొవ్వులు చర్మానికి పోషణ అందించి, చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మ సమస్యలకు చెక్ పెడుతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. చర్మాన్ని మృదువుగా, కోమలంగా చేస్తుంది. కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ జుట్టుని పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. దీంతో జుట్టు షైనీగా మారుతుంది. దీని వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేస్తుంది.
పచ్చి కొబ్బరి ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి మెరుగుపరచడంలో, ప్రకాశవంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. రోజూ పచ్చి కొబ్బరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి