సుగాలీ ప్రీతి కేసులో కీలక పరిణామం
అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.) :సుగాలి ప్రతీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన క
సుగాలీ ప్రీతి కేసులో కీలక పరిణామం


అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)

:సుగాలి ప్రతీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి అప్పగిస్తూ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande