టీమిండియా పొగరు దించుతాం... ఫైనల్ కు ముందు అక్తర్ వార్నింగ్!
హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే... మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాకు తల పొగరు ఉందని.
టీమిండియా


హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)

ఆసియా కప్ 2025 టోర్నమెంట్

ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే... మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాకు తల పొగరు ఉందని.. దాన్ని పూర్తిగా దించుతామని హెచ్చరించాడు. టీమిండియాను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు మా ప్లేయర్లు చేస్తారన్నారు.

కచ్చితంగా ఫైనల్స్ లో టీమిండియాను ఓడించడం పక్కా అంటూ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రెచ్చిపోయాడు. దీంతో అతను చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో భాగంగా ఎల్లుండి అంటే ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు ఉండనుంది. కాగా ఇప్పటికే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య రెండు సార్లు మ్యాచ్ జరిగింది. ఇందులో రెండు సార్లు టీమిండియానే విజయం సాధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande