‘మన్ కీ బాత్‌’లో వినతి.. భారత శునక జాతులకు బీఎస్‌ఎఫ్‌ శిక్షణ
దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.): భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) దేశ సరిహద్దుల్లో మోహరింపునకు భారత శునక జాతులను ఎంచుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 20 జాతులకు చెందిన 150 శునకాలకు శిక్షణ అందించింది. ఈ జాతులలో రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ ప్రధానం
‘మన్ కీ బాత్‌’లో వినతి.. భారత శునక జాతులకు బీఎస్‌ఎఫ్‌ శిక్షణ


దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.): భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) దేశ సరిహద్దుల్లో మోహరింపునకు భారత శునక జాతులను ఎంచుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 20 జాతులకు చెందిన 150 శునకాలకు శిక్షణ అందించింది. ఈ జాతులలో రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ ప్రధానంగా ఉన్నాయి. శునకాలను దత్తత తీసుకోవాలనుకుంటున్నవారు భారత శునక జాతులను ఎంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’లో కోరారు. దీనిని అమలు చేసేందుకు బీఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.

‘మన్ కీ బాత్’లో ప్రధాని వినతి దరిమిలా బీఎస్ఎఫ్ భారత శునక జాతి కుక్కలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ఇప్పటివరకు మేము 150 భారత జాతి శునకాలకు శిక్షణ ఇచ్చాం. వాటిని సరిహద్దుల్లో మోహరించాం. 20 శునకాలు బ్రీడింగ్ సెంటర్‌లో ఉన్నాయి’ అని టెకాన్‌పూర్‌లోని బీఎస్ఎఫ్ అకాడమీ ఏడీజీ, డైరెక్టర్ షంషేర్ సింగ్ తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత పలు ఛాంపియన్‌షిప్‌లలో విదేశీ జాతి శునకాలను ఓడించిన భారత జాతి శునకం ‘రియా’ కథను సింగ్ పంచుకున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande