భద్రాచలం, 26 సెప్టెంబర్ (హి.స.): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చేరుకుంటుంది.
నిన్న గురువారం సాయంత్రం 37 అడుగులు ఉన్న గోదావరి, ఈ రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు 40.80 అడుగులకు పెరిగింది.
పాల్వంచ లోని కిన్నెరసాని ప్రాజెక్టు ఒక గేట్ ఓపెన్ చేసి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న కిన్నెరసాని నదిలోకి వదిలారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ 6 గేట్లు తెరిచి 8,548 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి