దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.)భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముకలా ఉండి.. ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్-21 (MiG-21)కు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ (Air Chief Marshal AP Singh) వీడ్కోలు పలికారు. శుక్రవారం చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐఏఎఫ్ సీనియర్ అధికారులు, మాజీలు హాజరయ్యారు.
ఈ రకం విమానం భారత్‌లో తొలిసారి అడుగుపెట్టింది కూడా ఈ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోనే కావడం విశేషం. నాడు ‘ఫస్ట్ సూపర్ సోనిక్స్’గా వ్యవహరించే 28వ స్క్వాడ్రన్‌కు వీటిని మొదటిసారి అప్పగించారు. వింగ్ కమాండర్ దిల్బాగ్ సింగ్ దీనికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి ఎదిగారు. ఇక మిగ్-21లు కూడా దాదాపు 60 ఏళ్లకు పైగా వాయుసేనకు సేవలు అందించాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ