యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌లో సంక్షోభం.. విదేశాంగ మంత్రి జైశంకర్
న్యూయార్క్‌, 26 సెప్టెంబర్ (హి.స.)రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌లో ఇంధనం, ఆహారం, ఎరువుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) నొక్కి చెప్పారు. సరఫరా గొలుసులు, లాజిస్టి
జైశంకర్


న్యూయార్క్‌, 26 సెప్టెంబర్ (హి.స.)రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌లో ఇంధనం, ఆహారం, ఎరువుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) నొక్కి చెప్పారు. సరఫరా గొలుసులు, లాజిస్టిక్స్ దెబ్బతిన్నాయని, అనేక దేశాలకు లభ్యతపై మాత్రమే కాకుండా ఖర్చుపై కూడా గణనీయమైన ప్రభావం పడిందని తెలిపారు. చర్చలు, దౌత్యం సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ పరిస్థితి రాజకీయంగా, ఆర్థికంగా అస్థిరంగా ఉందని తెలిపారు.

ఉగ్రవాదం అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకిగా మారిందన్నారు. ఈ సమస్యపై ప్రపంచం రాజీపడకుండా ఉండటం ఎంతో అవసరమని వెల్లడించారు. సంఘర్షణలను మరింత క్లిష్టతరం చేయడం కంటే చర్చలు, దౌత్యం దిశగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా సంఘర్షణ టైంలో ఇరుపక్షాలను కలుపుకునే సామర్థ్యం కొంతమందికి ఉంటుందని, అలాంటి దేశాలను అంతర్జాతీయ సమాజం ఉపయోగించుకుని శాంతి సాధనకు దోహదపడాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande