అన్నవరం, 26 సెప్టెంబర్ (హి.స.)సత్యనారాయణ స్వామి సన్నిథి కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.
ఈ రోజు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రత్నగిరి (Ratnagiri)పై పడమటి రాజగోపురం సమీపంలో ఉన్న దుకాణ సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన షాపు నిర్వాహకులు, ఆలయ సెక్యూరిటీ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు స్పాట్ చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం ఐదు దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా సమాచారం. అయితే, ఈ ప్రమాదానికి షాట్ సర్క్యూటేనని ఆలయ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి