దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.): పాలస్తీనా అంశంపై మోదీ సర్కారు మౌనం.. మానవత్వం, నైతికతలకు తిలోదకాలు ఇచ్చేలా ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె రాసిన వ్యాసం ‘ఇండియాస్ మ్యూటెడ్ వాయిస్, ఇట్స్ డిటాచ్‌మెంట్ విత్ పాలస్తీనా’ శీర్షికన గురువారం ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. పాలస్తీనా అంశంపై ఇటీవలి కాలంలో ఆమె రాసిన మూడో వ్యాసమిది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాని మోదీకి ఉన్న వ్యక్తిగత స్నేహం ప్రాతిపదికనే కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానాల రూపకల్పన జరుగుతున్నట్లుగా అనిపిస్తోందని సోనియాగాంధీ విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ