అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజులుగా.. వాడివేడీగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. నల్ల కండువాలు వేసుకుని ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్ గౌరవాన్ని కాపాడాలని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేశారు. గేట్‌లో నుంచి నినాదాలు చేసుకుంటూ.. కార్యాలయం వరకు వచ్చారు. Km నిన్న(శుక్రవారం) మండలిలో కూడా చైర్మన్‌ను ప్రభుత్వం అగౌరవ పరుస్తుందంటూ.. వైసీపీ MLCలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ