అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు( నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు( తెలిపారు. ఎనిమిది రోజులపాటు జరిగాయి అసెంబ్లీ సమావేశాలు. 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టామని.. అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయనిపేర్కొన్నారు. మూడు బిల్లులు ఉపసంహరణ చేశామని వెల్లడించారు. అసెంబ్లీలో ఆరు అంశాలపై లఘుచర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శాసనసభ నిరవదిక వాయిదా వేశామని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ