27 సెప్టెంబర్ (హి.స.) :బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేజీ 4జీ నెట్‌వర్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( ఈరోజు (శనివారం) ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్‌ను లాభాల బాటలోకి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా బీఎస్ఎన్‌ఎల్ సేవలు అందాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ