తెలంగాణ, ఆదిలాబాద్. 27 సెప్టెంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా భోథ్
మండలంలోని ధన్నూర్ గ్రామంలో
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడల్లో నడవాలని ఆయనలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు