నేటి యుగంలో ఉద్యోగం కావాలంటే నైపుణ్యం తప్పనిసరి.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి. 27 సెప్టెంబర్ (హి.స.) నేటి యుగంలో ఉద్యోగం కావాలంటే నైపుణ్యం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మేడ్చల్ జిల్లా మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్ వ
సీఎం రేవంత్ రెడ్డి


తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి. 27 సెప్టెంబర్ (హి.స.)

నేటి యుగంలో ఉద్యోగం కావాలంటే

నైపుణ్యం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మేడ్చల్ జిల్లా మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్ వారి సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఉన్నా.. యువతలో నైపుణ్యం లేదని విషయం తమ దృష్టి వచ్చిందని అన్నారు. హైదరాబాద్ వచ్చాక చదువుతో పాటు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు ఆలోచన చేశామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande