మూసికి పోటెత్తిన వరద. చాదర్ఘాట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్.
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) మూసీకి వరద పోటెత్తడంతో.. చాదర్ ఘాట్ వద్ద బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు. దీంతో కోఠి, నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బ
ట్రాఫిక్ జామ్


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

మూసీకి వరద పోటెత్తడంతో.. చాదర్ ఘాట్ వద్ద బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు. దీంతో కోఠి, నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదర్ ఘాట్ నుంచి మలక్పేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

చాదరాఘాట్ చిన్న వంతెనపై 6 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. మూసారంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర నది ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఇక అంబర్పేట్ – మూసారంబాగ్ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జిని తాకుతూ వరద కొనసాగుతోంది. ఈ వరద నీటిలో నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామాగ్రి కొట్టుకుపోయింది. మూసారంబాగ్ వైపు ఉన్న పెట్రోల్ పంపు కూడా నీట మునిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande