అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.),:ఏపీ శాసనమండలి సమావేశాల్లో) కాఫీ విషయంలో రగడ చోటు చేసుకుంది. మండలిలో ఇచ్చే కాఫీకి, అసెంబ్లీలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు Leఅభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభలో, మండలిలో ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. శాసనసభ, మండలిలో కాఫీ, భోజనాల విషయంలో తేడా ఎక్కడా లేదని వివరణ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ