ముంబ, ై27 సెప్టెంబర్ (హి.స.)బంగారం ధర రోజు రోజుకు రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. పసిడి ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి రికార్డు స్థాయిలో లక్షా 15 వేల మార్క్ దాటి.. ఆల్ టైం హైకి చేరుకుంది. అయితే.. వెండి ధరలు కూడా పసడి బాటలోనే కొనసాగుతోంది. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి.. అయితే.. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతాయి.. అయితే.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూడా పసిడి, వెండి ధరలు పెరిగాయి.. సెప్టెంబర్ 27, 2025, శనివారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.10 మేర పెరిగి.. ధర రూ.1,14,890 గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 మేర పెరిగి. ధర రూ.1,05,310 కి చేరుకుంది.
వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,43,100 గా ఉంది.
అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,14,890 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,310 ఉంది. కిలో వెండి ధర రూ.1,53,100 గా ఉంది.
-----
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి