సంగారెడ్డి, మెదక్ జిల్లాలను వణికిస్తున్న మంజీరా..వరద ముంపులో జాతీయ రహదారులు..
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) సంగారెడ్డి, మెదక్ జిల్లాలను మంజీరా నది వణికిస్తుంది. సింగూరు, మంజీరా బ్యారేజ్ నుంచి వరద పోటెత్తుతుంది. దీంతో ఏడుపాయల వన దుర్గా దేవీ ఆలయం దగ్గర లక్షా 24 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన
వరద ముప్పు


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) సంగారెడ్డి, మెదక్ జిల్లాలను మంజీరా నది వణికిస్తుంది. సింగూరు, మంజీరా బ్యారేజ్ నుంచి వరద పోటెత్తుతుంది. దీంతో ఏడుపాయల వన దుర్గా దేవీ ఆలయం దగ్గర లక్షా 24 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఏడుపాయల దుర్గమ్మ ఆలయానికి వచ్చే దారులన్నీ ఇప్పటికే పోలీసులు మూసివేశారు. భక్తులు ఎవరు కూడా ఆలయం వైపు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంజీరా నది ఉగ్రరూపానికి ఏడుపాయల ఆలయం వద్ద ప్రసాదాల పంపిణీ షెడ్డూ కొట్టుకుపోయింది. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారులు నది వైపు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరోవైపు, భారీ వర్షాలతో నేషనల్ హైవేలు నీట మునిగాయి. చేర్యాల గేటు దగ్గర NH 161 ఎంట్రన్స్ పై భారీగా వరద నిలిచింది. NH 65, NH 365B లపై అదే పరిస్థితి ఏర్పడింది. హైవేపై వాహనాల టైర్లు మునిగే ఎత్తు వరకు నీరు ప్రవాహం కొనసాగుతుంది. దీంతో జోగిపేట, నారాయణఖేడ్, నాందేడ్ వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎంట్రెన్స్ వరకు వెళ్లి ద్విచక్ర వాహనాదారులు తిరిగి వస్తున్నారు. కార్లతో పాటు భారీ వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande