అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.), :విద్యారంగంలో కోనసీమ ప్రాంతా న్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి లోకేశ్ శాసనసభలో తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో సమయంలో మంత్రి సమాధానాలు ఇచ్చారు. కోనసీమలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగం వెనకబడి ఉందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి నూతన సిలబ్‌సను తీసుకొస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ