హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబర్ 29 (సోమవారం)వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. అయితే, 29వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్లతో వాదిస్తారు. ఇక, అక్టోబర్ 1వ తేదీన ఫిర్యాదుదారు అడ్వకేట్స్ తో పాటు పార్టీ మారిన లాయర్లతో వాదిస్తారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, మధ్యాహ్నం 3గంటలకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు హాజరుకానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు