తెలంగాణ, మెదక్. 27 సెప్టెంబర్ (హి.స.)
మెదక్ జిల్లా రామాయంపేట లో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శనివారం ప్రారంభించారు. రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం 1 కోటి 20 లక్షల విలువగల పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. రామాయంపేట ప్రజలకు 30 ఏళ్ల కళగా మిగిలిపోయిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు