హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ దూకుడుగా వెళ్తాంది. ఈ మేరకు శుక్రవారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నెం.9ని విడుదల చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బంధు అంటూ కొనియాడారు. తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి తూచా.. తప్పకుండా అమలు చేసి చూపిస్తున్నాడని కామెంట్ చేశారు.
కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ ఆప్తుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోని మొట్ట మొదటిసారిగా సమగ్ర కులగణన చేసి శాస్త్రీయ పద్ధతిలో విధానాన్ని రూపొందించి అన్ని రకాలుగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత రేవంత్తోనని కొనియాడారు. రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాలు అంత కాంగ్రెస్ వైపే ఉండాలని ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..