ఎంపీ ఈటెల రాజేందర్ మెజారిటీ వెనుక ఓటు చోరీ.. పీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ బీజేపీ ఎంపీల్లో కొందరు ఓటు చోరీ వల్లే గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ఈ ఆరోపణలను గతంలో కరీంనగర్ లోనే చేశానని, అక్కడ ఒ
పీసీసీ చీఫ్


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ బీజేపీ ఎంపీల్లో కొందరు ఓటు చోరీ వల్లే గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ఈ ఆరోపణలను గతంలో కరీంనగర్ లోనే చేశానని, అక్కడ ఒక షెడ్డులో 40 ఓట్లు నమోదు అయ్యాయని అన్నారు. వీటిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినా ఇప్పటి ఆయన వరకు సమాధానం చెప్పలేదన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనూ ఓట్లలో అవకతవకలు జరిగాయన్నారు. ఈటల రాజేందర్ కు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు లక్షల మెజార్టీ వచ్చిందంటే దీంట్లో గోల్ మాల్ జరిగిందని ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని లేదన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ సరైన రీతిలో సమాధానం చెప్పకపోగా బీజేపీకి ఈసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మాదిరిగా మాట్లాడుతోందని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande