ఆంధ్రప్రదేశ్ పూలు జిల్లాల్లో.మోస్తరు.నుంచి భారీ వర్షాలు.కురిసే అవకాశం
అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.) :వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో.. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి పూరీకి 60 కిలోమీటర్లు.. గోపాల్‌పూర్
ఆంధ్రప్రదేశ్ పూలు జిల్లాల్లో.మోస్తరు.నుంచి భారీ వర్షాలు.కురిసే అవకాశం


అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)

:వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో.. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి పూరీకి 60 కిలోమీటర్లు.. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70 కిలోమీటర్లు, కళింగపట్నం(ఏపీ)కి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను వాయుగుండం దాటనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande