రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. డీసీఎం, ఆటో ఢీ.. ముగ్గురు మృతి
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు వద్ద డీసీఎం మిల్లర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థ లానికి చేరుకుని
రోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు వద్ద డీసీఎం మిల్లర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థ లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతులను యాచారం మండలం కురుమిద్దకు చెందిన సత్తెమ్మ(50), శ్రీనివాస్ 935), శ్రీధర్ (25) గా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande