యుద్ధ ప్రాతిపదికన రోడ్డులను మరమ్మతులు చేయాలి : ఎమ్మెల్యే చింత ప్రభాకర్
తెలంగాణ, సంగారెడ్డి. 27 సెప్టెంబర్ (హి.స.) రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం సైదాపూర్ లో భారీ వరదకు రోడ్డు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆయా గ్రామాల్లో పర్యటించార
సంగారెడ్డి ఎమ్మెల్యే


తెలంగాణ, సంగారెడ్డి. 27 సెప్టెంబర్ (హి.స.)

రెండు రోజులుగా కురుస్తున్న భారీ

వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం సైదాపూర్ లో భారీ వరదకు రోడ్డు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆయా గ్రామాల్లో పర్యటించారు. కొట్టుకుపోయిన రహదారులను యుద్ధప్రాతిపదికన వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అలాగే సదాశివపేట, టేకులపల్లి, అనంతసాగర్ మోమిన్ పేట్ వైపు రాకపోకలు నిలిచిపోయిన కారణంగా తగు సహాయక చర్యలు చేయాల్సిందిగా సూచించారు. సైదాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. వాతావరణ శాఖ తీవ్ర వర్షాలు ఉంటాయని హెచ్చరించిన ప్రభుత్వం అప్రమత్తంగా లేదనీ, ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాలని అన్నారు. అధికారు నిర్లక్ష్యం చేయకుండా, సైదాపూర్ గ్రామ శివారులో కొట్టుకుపోయిన రోడ్డును ప్రజలను ఇబ్బందులు లేకుండా వెంటనే రోడ్డుపనులు ప్రారంభించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande